ప్లానెట్‌ గ్రీన్‌కు ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డు

ధరణి బ్యూరో:
పర్యావరణ సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ రంగంలో విశిష్ట కృషి చేస్తోన్న ప్లానెట్‌ గ్రీన్‌ సంస్థకు ఇన్‌ఫ్రా రంగంలో ప్రతిష్టాత్మక ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డు వరించింది. ఇటీవల నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్లానెట్‌ గ్రీన్‌ సంస్థ అధినేత వినయ్‌రామ్‌కు ‘రౌండ్‌ టేబుల్‌ ఇండియా’ సంస్థ ప్రదానం చేసింది. ఈ అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. సంస్థ ఉద్యోగుల సమిష్టి కృషితోనే అవార్డు సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ అగర్వాల్, డాక్టర్‌ ఎన్వితా ఫెర్నాండెజ్, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, నటుడు, పారిశ్రామిక వేత్త మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి