‘హోంల్యాండ్’ బాలానగర్‌లో ఘనంగా యోగా డే

ప్రముఖ నిర్మాణ సంస్థ రఘురాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో బాలానగర్‌లోని ఏ2ఏ హోంల్యాండ్ ప్రాజెక్ట్ వద్ద బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యోగా ట్రైనర్స్ రాజేశ్వరి, రజనీల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా యోగా సాధన చేశారు. వీరిలో సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములు ఉన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. మనసు, శరీరం, ఆత్మను అనుసంధానం చేస్తూ సాగిన ఈ యోగా ప్రక్రియ.. సాధకులకు శారీరక, మానసిక ఉత్సాహాన్ని నింపింది. మానవ శరీరంలో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించేందుకు ఉపయోగపడే ఏడు కీలకమైన చక్రాల కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ‘ఏ2ఏ హోంల్యాండ్’ ప్రాజెక్ట్‌లో పార్క్‌లను తీర్చిదిద్దడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌లో ఫేజ్–1లో భాగంగా 12 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాక్‌లను నిర్మిస్తున్నారు. వీటిలో 1700 నుంచి 2260 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ 3బీహెచ్‌కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. బాలానగర్ ఏరియాలో హోంల్యాండ్ ప్రాజెక్ట్ అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ కావడం విశేషం. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకునేందుకు 7070787979లో సంప్రదించవచ్చు.

– ధరణి బ్యూరో