చారిత్రక నగరి… అభివృద్ధి ఝురి.. భువనగిరి

  • నూతన రియల్‌ ప్రాజెక్టుల వెల్లువ
  • సిటీజన్ల చూపు.. భువనగిరి వైపు
  • మిడిల్‌ క్లాస్‌కు అందుబాటులో ధరలు
  • ఓపెన్‌ ప్లాట్స్, రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు నెలవు

ధరణి బ్యూరో:
మహానగరానికి తూర్పున విస్తరించిన ఖిలాటౌన్‌ భువనగిరి శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రతిష్టాత్మక యాదాద్రి టెంపుల్‌ అభివృద్ధి తర్వాత నేషనల్‌ హైవే 163పై రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భువనగిరి చెరగని ముద్ర వేస్తోంది. వందల సంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వస్తుండగా… హౌజింగ్‌ ప్రాజెక్టులు సైతం వెలుస్తున్నాయి. భువనగిరి కేంద్రంగా యాదాద్రి, ఆలేరు ఏరియాల్లో రియల్‌ జోష్‌ కొనసాగుతోంది. ప్రధానంగా భువనగిరి హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావడంతోపాటు హైదరాబాద్‌ కోర్‌ సిటీకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతంలో రియల్‌ పెట్టుబడులకు చాలామంది ఆసక్తి కనబర్చుతున్నారు. సమీపంలోని బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఉండటం, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత భువనగిరిలో నూతన కలెక్టరేట్‌ ఏర్పాటవడంతోపాటు ఉద్యోగావకాశాలు విస్తృతం అయ్యాయి. ఎయిమ్స్‌ వల్ల ప్రత్యక్షంగా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా వందల మంది లబ్ధి పొందుతున్నారు. తద్వారా ఇక్కడి పరిసర ప్రాంతాల్లో రియల్‌ అవసరాలు ఉత్పన్నమవడం కలిసొచ్చిన అంశం. పైగా రోడ్డు, రైలు మార్గాలకు కొదవలేదు. ఎంఎంటీఎస్‌ను భువనగిరి వరకు పొడగించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్‌ శివారులో ఈ ప్రాంతం ఉందని చెప్పవచ్చు. దీనిద్వారానే ఇక్కడి ప్రాంతంలో రియల్‌ పెట్టుబడుల వరద కొనసాగుతోంది. విస్తృతంగా ఓపెన్‌ స్పేస్‌ ఉండటంతో వేలాది ఎకరాల్లో వెంచర్లు వస్తున్నాయి. పైగా సరసమైన ధరల్లో ఓపెన్‌ ప్లాట్లు లభిస్తుండటంతో కొనుగోళ్లకు చాలా మంది ఆసక్తి కనబర్చుతున్నారు. తక్కువ సమయంలో ధరలు రెట్టింపు అవుతాయన్న ధీమాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే తక్కువ బడ్జెట్‌లోనే భువనగిరి శివారు ప్రాంతాల్లో ఇండిపెండెంట్‌ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. 2బీహెచ్‌కే ఇల్లు సుమారు రూ. 50 లక్షల్లోపే కొనుగోలు చేయవచ్చు. ఇలా ధరలు అందుబాటులో ఉండటం.. పెట్టిన పెట్టుబడికి భవిష్యత్‌లో మంచి రిటర్న్స్‌ వస్తాయన్న నమ్మకంతో సిటీజనులు ఇక్కడివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సోషల్‌ ఇన్‌ఫ్రాకు కొదవలేదు. స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, హాస్పిటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి.
–––––––

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి