లగ్జరీ డ్రీమ్‌ హోమ్స్‌.. ‘హోం ల్యాండ్‌’

  • నిర్మాణ రంగంలో ‘రఘురాం ఇన్‌ఫ్రా’ నవశకానికి నాంది
  • బాలానగర్‌లో అద్బుతమైన లార్జెస్ట్‌ 3 బీహెచ్‌కె గేటెడ్‌ కమ్యూనిటీ
  • 7 చక్రాల కాన్సెప్ట్‌తో ఆరోగ్యం, ఆనందం మీ సొంతం
  • లొకేషన్, కనెక్టివిటీ సూపర్‌
  • మనసు దోచుకునే విలాసవంతమైన ఎమినిటీస్‌

ధరణి బ్యూరో:
అభివృద్ధికి కేరాఫ్‌గా మారిన బాలానగర్‌లో సకల సౌకర్యాలు, వసతులతో మీ కలలను సాకారం చేసేందుకు లగ్జరీ ‘ ఏ2ఏ హోం ల్యాండ్‌’ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది. ఏ2ఏ సెంట్రల్‌ మాల్‌కు సమీపంలో ఫేజ్‌–1 ప్రాజెక్టును 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఈ ప్రాంగణంలో 7 బ్లాకులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ గేటెడ్‌ కమ్యూనిటీలో 1700 ఎస్‌ఎఫ్‌టీ నుంచి 2260 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను చేరువ చేసేందుకు 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్‌హౌజ్‌లను సైతం నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టు టీఎస్‌ రెరా నెం: పి02200004978

బాలానగర్‌లో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ…
చుట్టూ ఆహ్లాదకరమైన, ప్రకృతి రమణీయత,హరిత వాతావరణం అభివృద్ధి చేసిన ప్రాంగంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నారు. సిటీ సెంటర్‌లో నెలకొన్న ఈ ప్రాజెక్టు కూకట్‌ పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్‌కు అత్యంత చేరువలో ఉంది. ఈ ప్రాంగణంలో అభివృద్ధి చేసిన ల్యాండ్‌ స్కేపింగ్‌లో మనిషిలో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యానికి కేంద్ర బిందువుగా ఉండే 7 చక్రాల కాన్సెప్ట్‌లో తీర్చిదిద్దారు. ప్రతీ ఫ్లాట్‌కు విశాలమైన బాల్కనీలు కనువిందు చేస్తున్నాయి. ఫేజ్‌–1లో ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 1700 చదరపు అడుగుల నుంచి 2260 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.

ఎమినిటీస్‌ సూపర్‌…
హోం ల్యాండ్‌ ప్రాజెక్టులో మౌలిక వసతుల కల్పన, కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో పలు వసతులు కల్పించారు. కెఫెటీరియా, కాఫీ షాప్,ఇండోర్‌ గేమ్స్, క్రెచ్, టాడ్లర్స్‌ ప్లే, లెర్నింగ్‌ సెంటర్, మినీ బోర్డ్‌ రూమ్స్, బిజినెస్‌ లాంజ్, గెస్ట్‌రూమ్స్, మల్టిపర్పస్‌ హాల్, కిడ్స్, పెద్దవారికి వేర్వేరుగా స్మిమ్మింగ్‌ ఫూల్స్, కన్వీనియెన్స్‌ స్టోర్, కిడ్స్‌ ప్లే ఏరియా, లేడీస్‌ అండ్‌ జెంట్స్‌ సెలూన్స్‌ , లైబ్రరీ, డ్యాన్స్‌ స్టూడియో, సీనియర్‌ సిటీజెన్స్‌ లాంజ్, లేడీస్‌ అండ్‌ జెంట్స్‌కు వేర్వేరుగా జిమ్స్, ప్రివ్యూ థియేటర్, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్, యోగా, మెడిటేషన్‌ ఏరియా కస్టమర్ల మనసు దోచుకుంటున్నాయి.

కనెక్టివిటీ అదుర్స్‌..
హోం ల్యాండ్‌ ప్రాజెక్టుకు నగరంలో ముఖ్యమైన ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఉంది. బాలానగర్‌ మెట్రో స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్టు నెలకొంది. పలు ఇంటర్నేషనల్‌ స్కూల్స్, హెల్త్‌కేర్‌ సదుపాయాలు, ప్రముఖ విద్యాసంస్థలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్, మాల్స్‌కు చేరువలో ఈ ప్రాజెక్టు కొలువైంది.

7 చక్రాల కన్సెప్ట్‌ ఇదీ..
బాలానగర్‌లో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీగా అవతరించిన హోంల్యాండ్‌ ప్రాజెక్టులో నివసించే ప్రతీ ఒక్కరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకుగాను ప్రతీ మనిషిలో ఏడు శక్తి కేంద్రాలను ఉద్దీపన చేసేందుకు ఈ కాన్సెప్ట్‌ను ఇక్కడ ప్రవేశపెట్టారు. సూక్ష్మ శక్తి నియంత్రణ ద్వారా ప్రతీ వ్యక్తినీ పరిపూర్ణులుగా తీర్చిదిద్దేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌లో ఫోకల్‌ ఎలిమెంట్‌గా పనిచేసే ఒకే స్ట్రెయిట్‌ యోగిక్‌ అక్షం వెంట 7 చక్రాలు ఉంచారు.

ఈ డిజైన్‌ ఆలోచన.. ప్రతీ వ్యక్తి వారి స్వంత ఆరోగ్యంతో పాటు స్వయం శక్తితో కనెక్ట్‌ అయ్యేలా ప్రోత్సహిస్తోంది. ఈ కాన్సెప్ట్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌లు, లోటస్‌ పాండ్‌లు, యోగా/మెడిటేషన్‌ డెక్‌లు, పిక్నిక్‌ ప్రాంతాలు, హెర్బ్స్, సీతాకోకచిలుక తోటలు, ప్లే కోర్ట్‌లు ప్రతీ చక్రంలో అవసరాన్ని బట్టి విశేషంగా తీర్చిదిద్దారు.

నాణ్యత, మన్నికకు భరోసా రఘురాం ఇన్‌ఫ్రా
హోం ల్యాండ్‌ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ రంగం సంస్థ రఘురాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లోఅంతర్భాగమైన ‘గ్లోబల్‌ హోమ్స్‌ అండ్‌ హైట్స్‌ ఎల్‌ఎల్‌పీ’ సంస్థ ప్రమోట్‌ చేసింది. గత 35 ఏళ్లుగా రఘురాం ఇన్‌ ఫ్రా సంస్థ నాణ్యత, నవకల్పన, కస్టమర్ల నమ్మకం, నిర్ణీత గడవులోగా ప్రాజెక్టులను పూర్తిచేసి వేలాది మంది హ్యాపీ కస్టమర్ల మనస్సులలో సుస్థిర స్థానం సంపాధించింది. సుదీర్ఘ ప్రస్థానంలో 40కి పైగా విజయవంతమైన ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు భారీ పారిశ్రామిక సంస్థలతో చేతులు కలిపి కస్టమర్ల కలలను సాకారం చేసింది. నగరంలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసింది. బాలానగర్‌ ప్రాంతంలో ఇప్పటికే ఏ2ఏ లైఫ్‌ స్పేసెస్, ఏ2ఏ సెంట్రల్‌ ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేసి కస్టమర్లకు అందజేసింది. ప్రతిష్టాత్మక క్రెడాయ్‌ సంస్థలో కీలక సభ్యత్వం ఈ సంస్థ సొంతం.

హోం ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లో ప్రముఖ కన్సల్టెంట్స్‌…
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పలు దిగ్గజ సంస్థలు ఆర్కిటెక్ట్, పీఎంసీ టీమ్‌లుగా పనిచేశాయి. వీటిలో జెనిసిస్‌ ప్లానర్స్, శిల్పా ఆర్కిటెక్ట్స్, ఎంఏ కన్సల్టింగ్‌ సర్వీసెస్, సినర్జీ ఇన్‌ఫ్రా కన్సల్టెంట్స్, స్పేస్‌ కాన్‌స్ట్రిస్ట్‌ సంస్థలు ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం.

రఘురాం ఇన్‌ఫ్రా విశిష్ట ప్రాజెక్టులివీ..
మ్యాగ్నస్‌:షేక్‌ పేట్‌ ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నెలకొంది. ఈ ప్రాంగణంలో 18 అంతస్తులున్న మూడు టవర్లున్నాయి. మరో టవర్‌ 23 అంతస్తుల్లో నిర్మించారు. మొత్తంగా ఇది∙రెడీ టు మూవ్‌ ఇన్‌ ప్రాజెక్టు . 2, 3, 4 బీహెచ్‌కె ఫ్లాట్స్‌ అందుబాటులో ఉండగా..ఒక్కో యూనిట్‌ 1200 చదరపు అడుగుల నుంచి 2965 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్‌ ఫేసింగ్‌ ప్లాట్స్‌ కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
వ్యూ రెసిడెన్సెస్‌: పుప్పాల్‌ గూడలో 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఏడు టవర్లలో ఒక్కోటి 24 నుంచి 36 అంతస్తుల్లో కొలువు దీరనున్నాయి. లగ్జరీ 3, 4 బీహెచ్‌కె ఫ్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌ 1500 ఎస్‌ఎఫ్‌టీ నుంచి 3975 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

హోం ల్యాండ్‌ ప్రాజెక్టులో ఫ్లాట్స్‌ బుక్‌ చేసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన నెంబరు: 98456 90 809

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి