గ్రీన్‌స్పేస్ కేరాఫ్ కొంపల్లి

- పెట్టుబడులకు ప్రత్యామ్నాయం ఈ ప్రాంతం
ధరణి బ్యూరో:
మహానగరానికి ఉత్తరాన ఉన్న కొంపల్లిలో రియల్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఐటీ సెక్టార్‌కు అతి సమీపంలో ఉండటంతోపాటు ఓపెన్‌స్పేస్, గ్రీస్‌స్పేస్ లభ్యత పుష్కలంగా ఉండటంతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కంపెనీలు తమ కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తృతం చేశాయి. నివాసయోగ్యమైన పరిస్థితులు బాగా ఉండటంతో ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఆధునిక జీవన విధానంలో శరవేగంగా కొంపల్లి అభివృద్ధి పథాన పరుగెడుతోంది. జాతీయ రహదారి–44పక్కనే విస్తరించిన ఈ ప్రాంతంలో రియల్ పెట్టుబడులకు బహుళ ఆప్షన్లు ఉన్నాయి. ప్రధానంగా టెకీలు.. హాట్‌కేక్‌లాంటి కొంపల్లిని ఎంచుకుంటున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో స్థిరాస్థి ధరలు చుక్కలను అంటుతుండటంతో.. ప్రత్యామ్నాయంగా ఈ ఏరియా పట్ల ఆసక్తి కనబర్చుతున్నారు. సరసమైన ధరల్లోనే ఇక్కడ స్థిరాస్తులు అందుబాటులో ఉండటం కలసివచ్చే అంశం. అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న, ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్‌గా మారిన ఈ ప్రాంతంలో సుమారు 70కిపైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. విల్లా ప్లాట్, విల్లాలు, అపార్ట్‌మెంట్లకు కొందవ లేదు.
ఐటీ సెక్టార్ సమీపంలో…
ఐటీ హబ్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలకు అతి సమీపంలో ఉండటం స్పెషల్ అట్రాక్షన్. ఈ ప్రాంతాలకు గరిష్టంగా 45 నిమిషాల ప్రయాణం. మణిమకుటం లాంటి ఓఆర్‌ఆర్ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంపల్లికి అతి సమీపంలో కొల్లారం, గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బొల్లారం వరకు ఎంఎంటీఎస్‌ని కొనసాగించాలన్న ప్రతిపాదిత ఉంది. ఇది కార్యరూపం దాల్చితే మరింత సులువుగా కొంపల్లికి చేరవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,500 పలుకుతోంది. గత ఐదేళ్లలో స్థిరాస్తుల విలువ 22 శాతం పెరిగినట్లు అనరాక్ గ్రూప్ తన అధ్యయనంలో పేర్కొంది.