వర్చువల్‌ హోం టూర్‌కు పెరుగుతోన్న క్రేజ్‌

  • సమయం ఆదా…పలు ప్రాపర్టీల సెర్చ్‌కు ఛాన్స్‌
  • కొనుగోలుకు ముందు నేరుగా విజిట్‌ చేయాల్సిందే
  • నగరంలో పెరిగిన వర్చువల్‌ వీడియో టూర్‌ట్రెండ్‌
  • ప్రాపర్టీపై ప్రాథమిక సమాచారానికి గేట్‌వే
  • ధరణి బ్యూరో:
  • ఫ్లాట్‌..ఇళ్లు..విల్లా ఏది కొనుగోలు చేయాలన్నా ఇప్పుడు వర్చువల్‌ హోం టూర్‌కు అధిక ప్రాధాన్యత నిస్తున్నారు కస్టమర్లు. ఇదే సమయంలో డెవలపర్లు, రియల్‌ ఏజెంట్లు, అమ్మకం దారులు సైతం డిజిటల్‌ టూర్‌ను మరింత ప్రోత్సహిస్తుండడం విశేషం. ఈ టూర్‌ ద్వారా ముందస్తుగా ఆయా ప్రాపర్టీలకు సంబంధించి అవసరమైన అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం దక్కడంతోపాటు విలువైన సమయం ఆదా అవుతుండడంతో నగరవాసులు ఈ టూర్‌కే మొగ్గు చూపుతున్నారు.
  • ఈ విషయాలు మరవద్దు..
  • డిజిటల్‌ హోం టూర్‌కు ప్రత్యేకంగా హై క్వాలిటీ వీడియోలు, చిత్రాలు తమకు పంపించాలని కస్టమర్లు విధిగా బిల్డర్లు లేదా ఏజెంట్లను అడగాలి. నాణ్యత లేని వీడియోల్లో భవనానికి సంబంధించి క్రాక్స్, వాల్‌ ఫినిషింగ్, మెటీరియల్స్, వివరాలను సమగ్రంగా తెలుసుకోవడం కష్టతరమౌతుంది. ఇక ప్రాపర్టీ గురించిన పూర్తి అవగాహన, ఫీచర్స్, వసతులు, చుట్టు పక్కల పరిసరాలు, లొకేషన్‌కు సంబంధించిన వివరాలను అత్యంత నాణ్యత కలిగిన డిజిటల్‌ వీడియో టూర్‌లో తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీడియోలను వీక్షిస్తున్నప్పుడు తప్పనిసరిగా నోట్స్‌ రాసుకోవడం మరచిపోవద్దు. ఈ నోట్స్‌ ద్వారా ప్రాపర్టీ హైలెట్స్‌ను నమోదు చేసుకోవచ్చు. తద్వారా మీరు ఇతర ప్రాపర్టీలతో మీరు కొనుగోలు చేయాలనుకున్న ప్రాపర్టీని పోల్చి చూడవచ్చు. ఈ నోట్స్‌ ఆధారంగా ఆయా ప్రాపర్టీలకు సంబంధించిన రిపేర్లు, రిన్నోవేషన్స్‌ తదితరాలపై ప్రశ్నలు వేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇక సీలింగ్‌ డిజైన్, ఫైర్‌ సేఫ్టీ అలారమ్స్, స్మోక్‌ అలారమ్స్, లైట్, వాష్‌రూమ్, ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌ తదితరS వివరాలను ఈ టూర్‌లో తెలుసుకోవాలి.
  • తప్పక విజిట్‌ చేయాల్సిందే..
  • డిజిటల్‌ వీడియో టూర్‌లో పలు రకాల ప్రాపర్టీల వీడియోలను వీక్షించినప్పటికీ..మీరు నచ్చిన, మెచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయాలని డిసైడ్‌ అయినపుడు ఆ ప్రాపర్టీ దగ్గరికి నేరుగా వెళ్లి అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకున్న తరవాతే డీల్‌ ఓకే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్చువల్‌ టూర్‌లు ప్రాపర్టీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తాయని స్పష్టం చేస్తున్నారు. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని అంశాలపై చెక్‌లిస్ట్‌ సిద్ధంచేసుకున్న తరవాతే మీరు నేరుగా ప్రాపర్టీ వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. బాల్కనీలు, కిటికీలు, పరిసరాలు ఇలా ప్రతీ అంశం విలువైనదేనని స్పష్టంచేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి