మీ అవసరాలకు ఓవర్‌ డ్రాఫ్ట్‌..

ధరణి బ్యూరో:
మీరు హోమ్‌ లోన్‌ తీసుకొని బ్యాంకులకు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా..? మీకు ఇతర అవసరాలకు మళ్లీ డబ్బు అవసరమైందా…? అయితే మీరు టాప్‌ అప్‌ హోమ్‌ లోన్‌లోనే అంతర్భాగంగా ఉన్న ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒకేసారి డబ్బు అవసరం లేదు అనుకున్నప్పుడే ఈ ఆప్షన్‌ వినియోగించుకోవాలి. కానీ ఈ విభాగంలో హోమ్‌ లోన్‌ కంటే అధిక వడ్డీ తప్పదు మరి. దీర్ఘకాలం వరకు మీ అవసరాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం మాత్రం ఉంటుంది. ఉపయోగించుకున్న మొత్తానికే మీరు వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండడం ఈవిధానం ప్రత్యేకత. ఇప్పటికే మీరు లోన్‌ తీసుకున్న బ్యాంక్‌ వద్ద మీ చెల్లింపుల హిస్టరీ,ఇతర బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌ అందుబాటులో ఉన్న నేపథ్యంలో మీరు అదనంగా మీ ఆదాయ పన్ను వివరాలు, ఇతర పత్రాలను సమర్పిస్తే ఈజీగా ఈ టాప్‌ అప్‌ లోన్‌–ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. అయితే మీ ఇన్‌కమ్, మీ ఇంటి మార్కెట్‌ విలువ ఆధారంగానే లోన్‌ మొత్తాన్ని బ్యాంకర్‌ నిర్ణయిస్తారు. కాగా ఇటీవలి కాలంలో గృహ రుణాలపై వడ్డీలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈవిషయంలోనూ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతే బ్యాంకర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి