ఔటర్‌ చుట్టూ ‘ ఐరా ’ ప్రాజెక్టులు

  • వినియోగ దారుల విశ్వాసమే మాకు బలం
  • అన్ని వర్గాలకు అందుబాటులో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాలు
  • రియాల్టీ, నిర్మాణ రంగాలు శివార్లకు షిఫ్ట్‌


ధరణి బ్యూరో:
రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌కు మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘ఐరా రియాల్టీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ 14 భారీ ప్రాజెక్టులను చేపట్టింది. వినియోగదారుల నమ్మకం, విశ్వాసమే తమను ముందుకు నడిపిస్తోందని సంస్థ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ నర్సిరెడ్డి తెలిపారు. సంస్థ భారీ ప్రాజెక్టులు, ప్రస్తుత రియల్‌ ఎస్టేట్‌ రంగం ట్రెండ్స్‌పై ప్రముఖ రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాల మ్యాగజైన్, ‘ధరణి మైత్రి’ వెబ్‌సైట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

వెస్ట్‌లో ఐరా భారీ ప్రాజెక్టులు..
ఐరా రియాల్టీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వెస్ట్‌లో పలు భారీ ప్రాజెక్టులను చేపట్టింది. కొల్లూరు, శంకర్‌పల్లి, జహీరాబాద్‌లో విల్లా ప్లాట్స్‌ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జహీరాబాద్‌లో సుమారు 350 ఎకరాల్లో భారీ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అన్ని అనుమతులు రానున్నాయి. గోల్ఫ్‌కోర్స్, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఈ వెంచర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆదిభట్ల, శంషాబాద్‌ ప్రాంతాల్లోనూ సంస్థ పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

కస్టమర్ల నమ్మకమే ముందుకు నడిపిస్తోంది..

మా సంస్థకు కస్టమర్ల నమ్మకమే ముందుకు నడిపిస్తోంది. మా వద్ద ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాలు కొనుగోలు చేసి సంతోషంగా ఉన్న∙కస్టమర్ల రిఫరెన్స్‌ ద్వారానే ఇతర వినియోగదారులు మా వద్ద కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. మా సంస్థ ప్రస్థానం 2019లో మొదలైంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు చేపట్టాము. వెయ్యికి పైగా కస్టమర్లు మా సంస్థ వద్ద ప్లాట్స్,ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేసి సంతృప్తిగా ఉన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పలు భారీ ప్రాజెక్టులను చేపట్టే దిశగా ముందుకెళుతున్నాము.

నగర మార్కెట్‌కు ఢోకా లేదు…
ఐటీ, బీపీఓ, కెపిఓ, ఫార్మా రంగాలకు కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ రంగంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాల వృద్ధికి పలు అవకాశాలున్నాయి. రెరా అమల్లోకి వచ్చిన తరవాత పారదర్శకత, జవాబుదారీ తనం పెరగడంతో వినియోగదారుల భద్రతకు పెద్దపీఠ వేసినటై్టంది. కానీ రెరా నమోదు ప్రక్రియ రెండు వారాల్లో పూర్తయ్యేలా నిబంధనలను సరళీకరించాలి. ఫైళ్ల క్లియరెన్స్‌ ను వేగవంతం చేయాలి.

గ్లోబల్‌ సిటీ..ప్రభుత్వ విధానాలూ అనుకూలం..
విశ్వనగరం బాటలో ముందుకెళుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి అభివృద్ధి ,మెరుగైన మౌలిక సదుపాయాలు, నూతన అభివృద్ధి ప్రాజెక్టులు, గ్లోబల్‌ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దాయి. పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై సహా ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నగరం శరవేగంగా దూసుకెళుతోంది. Sప్రభుత్వ విధానాలు రియల్టీ, నిర్మాణ రంగాలతోపాటు మాన్యుఫాక్చరింగ్, ఫార్మా సహా అన్ని రంగాలకు అనుకూలంగా ఉండడం ప్లస్‌ పాయింట్‌.

కోవిడ్‌ తరవాత శివార్లకు షిఫ్ట్‌…
కోవిడ్‌ కలకలం అనంతరం ప్రధాన నగరం కంటే నగర శివార్లలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న విల్లాలు, ఫ్లాట్స్, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్‌ హౌజ్‌లు, ప్లాట్స్‌కు గిరాకీ రెట్టింపైంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆక్సీజన్, ఆహ్లాదకరమైన పరిసరాలు, ఔటర్‌ రింగ్‌రోడ్డుతో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు ఇప్పుడు హాట్‌కేకుల్లా మారాయి. ప్రస్తుత తరుణంలో విల్లాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. కోవిడ్‌ కలకలంతో సుమారు 30 నుంచి 40 శాతం ధరలు పెరిగినా..మార్కెట్‌ నిలకడగా రాణిస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి