అసాధ్యాలను సుసాధ్యం చేసి
- అంచలంచెలుగా పైకెదిగిన రియల్ డెవలపర్
- క్రెడాయ్ జాతీయ వైస్ చైర్మన్ గుమ్మి రాంరెడ్డి
ధరణి బ్యూరో:
మొక్కవోని సంకల్పం, దీక్ష, పట్టుదల ఆయన సొంతం. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంచలంచెలుగా ఎదిగి నిర్మాణ రంగంలో లెజెండ్‌గా ప్రస్థానం సాగిస్తున్న ఆయన పేరు గుమ్మి రాంరెడ్డి. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(క్రెడాయ్) నేషనల్ వైస్ చైర్మన్. సుమారు మూడున్నర దశాబ్దాలకు పైగా నిర్మాణ రంగంలో కొనసాగుతూ..అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఇటు ప్రభుత్వం..అటు వేలాది మంది వినియోగదారుల మన్ననలు,సన్మానాలు దక్కించుకున్న రియల్ డెవలపర్ ఆయన.
ప్రస్థానం సాగిందిలా..
1963లో జన్మించిన రాంరెడ్డి ..నిర్మాణ రంగంలో అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కీర్తి శిఖరాలను అధిరోహించారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, క్రెడాయ్ సంస్థ విస్తరణకు పాటుపడుతోన్న ఆయన నిర్మాణ రంగంలో సుదీర్థ ప్రస్థానం సాగించారు. ప్రస్తుతం ఏఆర్‌కె గ్రూప్‌నకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రియల్,నిర్మాణ రంగంలో అనేక మందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్నవారితోపాటు నూతనంగా ప్రవేశిస్తున్న వారికి తన అనుభవ పాఠాలు నేర్పుతున్నారు. సుదీర్ఘ ప్రస్థానంలో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఏఆర్‌కె గ్రూపును 1989లో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు వెనక్కి తిరిగి చూడని విధంగా సంస్థను తీర్చిదిద్దారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మౌలిక వసతుల కల్పన, అగ్రి ఫామ్స్ రంగంలో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సాకారం చేయడం ఆయన సక్సెస్‌కు నిదర్శనం. సివిల్ ఇంజినీరింగ్‌లో S పట్టభద్రులైన ఆయన ఈ రంగంలో అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించారు. సవాళ్లతో కూడిన ప్రతిష్టాత్మకS ప్రాజెక్టులపై తనదైన ముద్రవేసి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్,బెంగళూరు మహానగరాల్లో వేలాదిగా నివాస గృహాలు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు.
కీర్తికిరీటంలో ఎన్నో అవార్డులు…
విజయానికి మారుపేరుగా నిలిచిన గుమ్మి రాంరెడ్డి తాను చేపట్టిన నిర్మాణ రంగ ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మక రేటింగ్ సంస్థ క్రిసిల్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందారు. నాణ్యమైన,మన్నికైన నిర్మాణాలు చేపట్టడంతోపాటు గడువులోపట వినియోగదారులకు సొంతింటి కలను నిజం చేయడంతో ఆయనకు ఈ గుర్తింపు దక్కింది.
దిగ్గజ కంపెనీల ప్రాజెక్టుల సాకారం..
తన కెరీర్‌లో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్,టాటా లాకిడ్ మార్టిన్,ఐటీసీ,మహీంద్రా సీఐఈ,షిండ్లెర్ ఎలక్ట్రిక్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీ,మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తదితర దిగ్గజ సంస్థలకు చెందిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. ఆయన క్రెడాయ్ సంస్థ తెలంగాణ చాప్టర్‌కు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేయడం విశేషం. క్రెడాయ్ సంస్థ విస్తరణ కు అహరహం శ్రమించారు. ఈ సంస్థకు రాష్ట్ర,జాతీయ స్థాయిలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. విస్తరణకు ఇతోధికంగా సేవ చేశారు. ప్రస్తుతం 2021–23 సంవత్సర కాలానికి క్రెడాయ్ నేషనల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రియల్ ఎస్టేట్,నిర్మాణ రంగాలపై అనేక రాష్ట్ర,జాతీయస్థాయి వేదికలపై కీలకోపన్యాసాలు చేశారు. దేశ అభ్యున్నతికి యువతే కీలకమని ప్రగాఢంగా విశ్వసిస్తారాయన. తన సంస్థ ఏఆర్‌కె ఫౌండేషన్ తరఫున అనేక మంది యువ ప్రొఫెషనల్స్, క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించి వారి కలలను సాకారం చేయడం ద్వారా వారికి మార్గదర్శిగా నిలిచారు. వ్యక్తిగతంగా స్వచ్ఛత, పరిశుభ్రత, సహజ జీవన విధానానికి ఆయన అధిక ప్రాధాన్యతనివ్వడం విశేషం. ప్రజలకు ఆరోగ్యం,ఆయుష్సును ప్రధానం చేసేందుకు ఆయన సతీమణి సరళ సహకారంతో 180 ఎకరాలకు పైగా సువిశాల విస్తీర్ణంలో ఆర్గానిక్ ఫామ్స్‌ను ఏఆర్‌కె గ్రూపు నిర్వహిస్తోంది. క్రీడలను అమితంగా ఇష్టపడే రాంరెడ్డి పర్సనల్‌గా మారథాన్ రన్నర్,సైక్లిస్టు కావడం విశేషం.