రియల్ ప్రాజెక్టు రిజిస్ట్రేషనా..?
- ప్రమోటర్ సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
ధరణి బ్యూరో:
టీఎస్ రెరాలో ఓక ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కోసం కాంపిటెంట్ అథారిటీ ఎదుట ప్రమోటర్ దాఖలు చేయాల్సిన డాక్యుమెంట్ల వివరాలు రెరా యాక్ట్ సెక్షన్(4)లో పొందుపరిచారు. ఈ సెక్షన్ ప్రకారం…
- ప్రమోటర్ పాన్ కార్డు అధీకృత నకలు.
- ప్రమోటర్‌కు చెందిన మూడు ఆర్థిక సంవత్సరాల వార్షిక బ్యాలెన్షీట్.
- క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్.
- డైరెక్టర్స్ రిపోర్టు.
- ఆడిటర్స్ రిపోర్టు.
- ఓపెన్ పార్కింగ్ ఏరియా, కవర్డ్ పార్కింగ్ ఏరియా వివరాలు.
- అభివృద్ధి పనులు చేపట్టనున్న ప్రాజెక్టు భూమిపై ప్రమోటర్‌కు ఉన్న యాజమాన్య హక్కులకు సంబంధించిన దస్తావేజులు(లింక్ డాక్యుమెంట్లతో సహా)
- అభివృద్ధి పనులు చేపట్టబోయే ప్రాజెక్టు భూమిపై ఉన్న తనఖాల వివరాలు. సదరు భూమిపై ఎవరికైనా హక్కులు ఉంటే వారికున్న హక్కులు,ప్రయోజనాలు, యాజమాన్య హక్కులు,బకాయిల వివరాలు.
- న్యాయపరమైన వివాదాలకు సంబంధించిన పత్రాలు.
- గత పదేళ్లుగా సదరు భూమిపై ఎలాంటి తనఖాలు లేవని ధ్రువీకరిస్తూ అడ్వకేట్ ఇచ్చిన సర్టిఫికెట్ లేక తహసిల్దార్ కన్నా అధిక హోదాగల రెవెన్యూ అథారిటీ ఇచ్చిన సర్టిఫికెట్.
- ప్రాజెక్టు అభివృద్ధికి సదరు భూమి యజమాని ప్రమోటర్‌కు ఇచ్చిన సమిష్టినిర్మాణ ఒప్పందము. యజమానికి సదరు భూమిపై ఉన్న హక్కులకు సంబంధించిన దస్తావేజుల కాపీలు.
- ప్రమోటర్ ఫోటో, పేరు, చిరునామా, ఫోన్‌నెంబర్ తదితర వ్యక్తిగత వివరాలు. ఇతర భాగస్వాముల వివరాలు సైతం.
- రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు లిఖిత పూర్వకంగా ఫారం–ఏ రూపంలో ఉండాలి.
- నిర్దేశిత ఫీజును డీడీ రూపంలో చెల్లించాలి.