రియల్‌ మహా రాణులే..!

  • రెడీ టూ మూవ్‌ ఇళ్లకే మహిళల ఓటు
  • నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు లేడీస్‌ క్యూ
  • గోల్డ్‌ కంటే సొంతిళ్లే ఇష్టం..
  • తాజా అధ్యయనంలో వెల్లడి..


ధరణి బ్యూరో:
ఆకాశంలో సగం..అంటూ అన్ని రంగాల్లో దూసుకెళుతోన్న మహిళామణులు..రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ రాణిస్తున్నారట. అంతేకాదు తమ కష్టార్జితాన్ని,పొదుపు మొత్తాన్ని ఈ రంగంలో పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 65 శాతం మంది మహిళలు రియల్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. మరో 20 శాతం మంది స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల వైపు మొగ్గు చూపతున్నారట. సంప్రదాయ కుటుంబాల్లో తరతరాలుగా బంగారంపై మహిళలకు ఆసక్తి ఉన్నా..గోల్డ్‌ ట్రేడింగ్‌లో ఆసక్తి చూపుతున్నవారు కేవలం 8 శాతమేనని ఈ నివేదిక స్పష్టం చేయడం విశేషం. ఇక పలు వాణిజ్య,ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు కేవలం 7 శాతం మంది మహిళలే ముందుకొస్తున్నారట. వినియోగదారుల సర్వే కింద దేశవ్యాప్తంగా అనరాక్‌ సంస్థ 5,500 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా ఈ ఫలితాలు లభించినట్లు ఈ నివేదిక పేర్కొంది.


ఇళ్లు..ఇల్లాలు..
ఇక పెళ్లైన మహిలల్లో సుమారు 83 శాతం మంది రూ.45 లక్షల ధర పలికే ఫ్లాట్స్‌ లేదా ఇల్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. మరో 36 శాతం మంది మహిళలు రూ.45–90 లక్షల మధ్యన థర పలికే ఇళ్ల కొనుగోలుకు ముందుకొస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇక 27 శాతం మంది మహిళామణులు రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్లు పలికే లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఇటీవలి కాలంలో ఇళ్ల కొనుగోలుకు అధికంగా ముందుకొస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే రెడీ టు మూవ్‌ ఇళ్ల కొనుగోలుకే లేడీస్‌ అధిక ప్రాధాన్యత నిస్తుండడం లేటెస్ట్‌ ట్రెండ్‌. దేశంలో పలు గృహనిర్మాణ పథకాలు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు,బ్యాంకుల వడ్డీ రేట్లు మహిళలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లు ఈనివేదిక వెల్లడించింది. ఆయా పథకాల కింద లభిస్తున్న రాయితీలను వినియోగించుకోవడంలోనూ లేడీస్‌ ఫస్ట్‌గా నిలుస్తుండడం విశేషం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి