గ్రేటర్‌ నెం. 6

  • రెరా ఎఫెక్ట్‌
  • ఐదేళ్లలో 74 శాతం ప్రాజెక్టులే పూర్తి
  • మెట్రో నగరాల్లో మనది ఆరో ర్యాంకు

ధరణి బ్యూరో:

రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగానికి కొంగుబంగారంగా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో రెరా ఎఫెక్ట్‌ సుస్పష్టంగా కనిపిస్తోంది. మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెరా చట్టం అమల్లోకి వచ్చిన తరవాత రియల్‌ సెక్టార్‌కు స్వల్పంగా ఝలక్‌ తగిలింది. గత ఐదేళ్ల కాలంలో రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో పూర్తియినవి మన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 74 శాతానికి మించి లేవని అనరాక్‌ సంస్థ తాజా రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మన సిటీ ఆరో ర్యాంకుకే పరిమితమైందని తేలింది. ఈ సర్వే రిపోర్టు మేరకు నగరంలో 2018లో 110 ప్రాజెక్టులకు రెరా అనుమతి లభించగా..కేవలం 81 ప్రాజెక్టులే పూర్తయినట్లు తేలింది. అంతేకాదు పలు ప్రాజెక్టుల ఆలస్యంపై రెరాకు నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం.
చెన్నై టాప్‌…
రెరా అనుమతి లభించి..పూర్తిచేసిన ప్రాజెక్టుల విషయంలో మన పొరుగునే ఉన్న చెన్నై సిటీ దేశంలోనే టాప్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. ఈ సిటీలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయినట్లు సర్వేలో తేలింది. రెండో ప్లేస్‌లో నిలిచిన బెంగళూరులో 85 శాతం..ముంబాయిలో 89 శాతం..పూణేలో 89 శాతం, ఢిల్లీలో 74 శాతం, కోల్‌కతాలో 70 శాతం మేర ప్రాజెక్టులు పూర్తయినట్లు అనరాక్‌ రిపోర్ట్‌ స్పష్టంచేసింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి