కోకాపేట్‌..బుద్వేల్‌..వాట్‌ నెక్స్‌ ›్ట


తాజా బూమ్‌కు కర్త, కర్మ, క్రియ సర్కారు పెద్దలే

ధరణి బ్యూరో:
కోకాపేట్‌లో ఎకరం అక్షరాలా వంద కోట్లు. బుద్వేల్‌లో ఎకరం గరిష్టంగా రూ.41 కోట్లు. పతాక స్థాయిలో కృత్రిమ రియల్‌ బూమ్‌ సృష్టించి వేల కోట్లు కొల్లగొట్టిన సర్కారు పెద్దల స్కెచ్‌ చూసి బడా రియల్‌ వ్యాపారులే విస్తుపోతున్నారు. రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాల వృద్ధికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లో తాజాగా జరిగిన ఈ– ఆక్షన్‌లో ఆయన బినామీ సంస్థలే కోట్ల రూపాయలు వెచ్చించి విలువైన జాగాలు దక్కించుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖజానా ఖాళీ అవ్వడంతోనే సర్కారు పెద్దలు సర్కారు భూములను తెగనమ్ముతున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. తాజాగా వేలం పాటలో పాల్గొన్న రాజపుష్ప రియాల్టీ సంస్థ కేటీఆర్‌ బినామీలదేనన్న టాక్‌ సైతం వినిపిస్తోంది. ఎకరం వంద కోట్లు వెచ్చించిన ఈ సంస్థ తాము కొనుగోలు చేసిన స్థలంలో హైరైజ్‌ టవర్లు నిర్మించి సుమారు రూ.3 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి. సామాన్య ,మధ్యతరగతి, వేతన జీవులు నగరంలో ఇళ్ల జాగాలు, ఫ్లాట్స్‌ కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా చేసిన పాపం సర్కారు పెద్దలదేనన్న అంశం కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా భూముల వేలంపాటతో కోట్ల రూపాయలు ఖజనాలో జమచేసుకున్న సర్కారు పెద్దలు తాజాగా ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకొన్ని ఉన్న పలు కీలక ప్రాంతాలు, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలోని మరిన్ని విలువైన స్థలాలను భూంఫట్‌ చేస్తుందన్న అంశం చర్చనీయాంశమైంది. నెక్ట్స్‌ ఏ ప్రాంతం ఈ లిస్టులో ఉంటుందన్న అంశంపై పలు రకాల స్పెక్యులేషన్స్‌ వెలువడుతుండడం గమనార్హం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి