కొంగు బంగారం కోకాపేట్‌

45.33 ఎకరాల వేలంపాట
ఎకరాకు రూ.35 కోట్లు నిర్దేశిత ధర
నియో పోలీస్‌ ఫేజ్‌–2 ప్లాట్ల వేలంపై భారీ అంచనాలు

ధరణి బ్యూరో:
రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు ఇప్పుడు కోకాపేట్‌ కొంగు బంగారమైంది. ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో హాట్‌కేక్‌లా మారిన ఈ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ఏకంగా 45.33 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ప్లాట్లను ఆక్షన్‌లో విక్రయించనుంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించింది. ప్లాట్‌ నెంబరు 6లో ఏడు ఎకరాలు, ఏడో నెంబరు ప్లాటులో 6.55 ఎకరాలు, ప్లాట్‌నెంబరు 8లో 9.71 ఎకరాలు, ఇక తొమ్మిదో నెంబరు ప్లాటులో 3.60 ఎకరాలు, ఇక పదోనెంబరు ప్లాట్‌లో 3.60 ఎకరాలు, పదకొండో నెంబరు ప్లాట్‌లో 7.53 ఎకరాలు, పద్నాలుగో నెంబరు ప్లాట్‌లో 7.34 ఎకరాలకు ఆక్షన్‌లో విక్రయించనుంది. ఈ వేలానికి సంబంధించి ప్రీబిడ్‌ సమావేశాన్ని ఈనెల 20న నిర్వహించనుంది. ఆసక్తిగలవారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఈనెల 31 సాయంత్రం 5 గంటల వరకు గడువునిచ్చింది. దరావత్తు చెల్లించేందుకు ఆగస్టు 1 సాయంత్రం 5 గంటల వరకు సమయమిచ్చింది. ఈ వేలాన్ని ఆగస్టు 3న నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. అదేరోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6,7,8,9 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 10,11,14 నెంబరు ప్లాట్లకు వేలం నిర్వహిస్తారు. ఎకరాకు నిర్దేశిత ధరను రూ.35 కోట్లుగా నిర్ణయించడం విశేషం. కనీస బిడ్‌ పెంపుదలను ఎకరాకు రూ.25 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంటుందని హె చ్‌ఎండీఏ స్పష్టం చేసింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి